బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
ఎస్ఐఆర్ రెండో విడత ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం బైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో జరిగిన అసెంబ్లీ కార్యాశాలలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎస్ఐఆర్ రెండో విడత ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం బైంసా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో బీజేపీ బీఎల్ఏ 2 కార్యకర్తలచే ఎస్ఐఆర్ రెండో విడతపై అసెంబ్లీ కార్యాశాల నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
బోగస్ ఓట్లకు తావుండదు
సర్వే ప్రక్రియతో బోగస్ ఓట్లకు ఇక తావుండదని, రెండో విడతలో ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులకు తెలియజేయాలని ఆయన అన్నారు. ఒకరికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ సర్వే ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు.
వలసదారులపై నియంత్రణ
వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు, విదేశీయులు చొరబడి ఇక్కడ ఉండకుండా చూడడానికి ఎస్ఐఆర్ ఎంతో దోహదపడుతుందన్నారు.
అంశాల వివరణ
అనంతరం ఎస్ఐఆర్ స్టేట్ కో కన్వీనర్ సంజర్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్, సర్ జిల్లా ఇన్చార్ రావుల రామ్ నాథ్, ముధోల్ ఎస్ఐఆర్ ఇన్చార్జి పైడిపల్లి గంగాధర్, ఎస్ఐఆర్ రెండో విడతలో చేపట్టాల్సిన అంశాలను వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తాత్రి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, రవి పాండే, అసెంబ్లీ కన్వీనర్ తాడేవార్ సాయినాథ్ తో పాటు మండల బీజేపీ అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











