బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
శ్రావణమాసం సందర్భంగా కనుగుట్ట గ్రామంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో జరగనున్న అఖండ జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్‌ను ఆశ్రమ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని వారు కోరారు.
శ్రావణమాసం సందర్భంగా కనుగుట్ట గ్రామంలోని శ్రీ శబరిమాత ఆశ్రమంలో నిర్వహించనున్న అఖండ జ్యోతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్‌ను ఆశ్రమ నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆశ్రమ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ కుమ్మరి భోజన్న, ఆశన్న బోజారెడ్డి తదితరులు డా. నరేష్ జాదవ్‌కు ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వదించాలని కోరారు.
శ్రావణమాసంలో నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా జరగాలని ఆశ్రమ నిర్వాహకులు ఆకాంక్షించారు.












