నిజామాబాద్, జూలై 31
గోకుల్ గో సేవ సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని పెద్ద రామాలయంలో శుక్రవారం వరుణ యాగం, గోపూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, లోకక్షేమం చేకూరాలని ఈ యాగాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
గోకుల్ గో సేవ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని పెద్ద రామాలయంలో వరుణ యాగం, గోపూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు పుష్కలంగా పండాలని, లోకక్షేమం చేకూరాలని సంకల్పించి ఈ యాగాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వహించిన యాగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించి, గోమాతతో పాటు శ్రీరామచంద్ర స్వామి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో గోకుల్ గో సేవ సమితి అధ్యక్షుడు తొడుపునూరి రామ్మోహన్, కార్యదర్శి తొడుపునూరి శ్రీనివాస్, కోశాధికారి అరవపల్లి బాలశేఖర్, గో సేవ వ్యవస్థాపక సభ్యులు మాదాని శ్రీధర్, గందె రాజశేఖర్, నల్లా నగేష్, ఆనంపల్లి ప్రమోద్, మామిడి రమేష్, పాపిని సతీష్, శివరాత్రి సంతోష్, నీల బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.












