హరిద్వార్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 30
గంగా నదిలో స్నానానికి వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోతున్న భక్తుడిని ఒక SDRF జవాన్ చాకచక్యంగా, ధైర్యంగా కాపాడారు. ఈ ఘటన హరిద్వార్‌లోని కాంగా ఘాట్ వద్ద చోటుచేసుకుంది. కాపాడిన జవాన్ చర్యలపై ప్రశంసలు దక్కుతున్నాయి.
గంగా నదిలో కొట్టుకుపోతున్న భక్తుడిని ఒక జవాన్ తన ప్రాణాలకు తెగించి రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన శివభక్తుడు హరిద్వార్‌లోని కాంగా ఘాట్ వద్ద గంగా నదిలో స్నానం చేస్తుండగా, వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఇది గమనించిన SDRF జవాన్ వెంటనే నదిలోకి దూకి భక్తుడిని పట్టుకున్నారు. వరద ప్రవాహం వారిని కిందికి లాకెళ్తున్నప్పటికీ, ఈదుతూ భక్తుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ పోలీస్ తమ X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయగా, ఆ జవాన్ ధైర్యసాహసాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.












