కరీంనగర్, 14/07/2026
కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసేలా బీబీ రాంజీ చట్టాన్ని తీసుకొస్తున్నారని, వెంటనే దాన్ని రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కూలీల వేతనాలను రూ. 600కు పెంచాలని, పాత బకాయిలు విడుదల చేయాలని ఆయన కోరారు.
కేంద్ర ప్రభుత్వ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా బీబీ రాంజీ చట్టాన్ని అమల్లోకి తెస్తున్నారని, వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
లేదంటే, వివిధ సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహించడానికి వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు. ఉపాధి హామీ కూలీలకు రోజువారీ వేతనాన్ని 600 రూపాయలకు పెంచాలని ఆయన అన్నారు. పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పట్టణ ప్రాంతాలలో కూడా గ్రామీణ ఉపాధి హామీ పనిని కొనసాగించాలని ఆయన కోరారు.
పని ప్రదేశాలలో తాగునీరు, టెంట్, మెడికల్ కిట్ వంటి వసతులు కల్పించాలని కూడా ఆయన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.











