మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 15
సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. రేవంత్ రెడ్డి పేరు ఒకే ఎపిక్ నంబర్‌తో రెండు ఓటర్ జాబితాలలో కనిపించడం కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని ఈసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఇలాంటి డూప్లికేట్ ఎంట్రీలను గుర్తించి, ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం (ECI) నిర్దేశించిన నిబంధనల మేరకు సంబంధిత జిల్లా ఎన్నికల అధికారి (DEO) ఈ సాంకేతిక లోపాన్ని సరిచేస్తారని స్పష్టం చేశారు.
ఒకే ఎపిక్ నంబర్ రెండు వేర్వేరు ఓటరు జాబితాల్లో ఉన్నంత మాత్రాన, సదరు వ్యక్తికి రెండు నియోజకవర్గాల్లో ఓటు వేసే హక్కు లేదని ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఇలాంటి పొరపాట్లు సర్వసాధారణమని, వాటన్నింటినీ త్వరలోనే జాబితా నుంచి తొలగిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు.