ఖానాపూర్, జూలై 21
రేషన్ కార్డు సేవలు నిరంతరాయంగా కొనసాగాలంటే, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ నెల 31వ తేదీలోపు కేవైసీ (బయోమెట్రిక్ ధ్రువీకరణ) ప్రక్రియను పూర్తి చేసుకోవాలని నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం సూచించారు. గడువులోగా కేవైసీ పూర్తి చేసుకోకపోతే రేషన్ సేవల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
రేషన్ కార్డు సేవలు నిరంతరంగా కొనసాగాలంటే ఈ నెల 31వ తేదీలోపు తప్పనిసరిగా కేవైసీ (బయోమెట్రిక్ ధ్రువీకరణ) పూర్తి చేసుకోవాలని నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం రేషన్ కార్డు లబ్ధిదారులకు సూచించారు.
రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి వేలిముద్ర ద్వారా బయోమెట్రిక్ ధ్రువీకరణ పూర్తి చేయించుకోవాలని తెలిపారు. కేవైసీ పూర్తయిన అనంతరం రేషన్ డీలర్ అందించే రసీదును తప్పనిసరిగా భద్రపరుచుకోవాలని సూచించారు.
జూలై 31 గడువులోగా కేవైసీ పూర్తి చేసుకోని లబ్ధిదారులు రేషన్ సేవల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ప్రతి రేషన్ కార్డుదారుడు గడువులోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు నిమ్మల రమేష్, ఖానాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గొర్రె గంగాధర్, జమాల్ ఖురేషీ, మేష సతీష్ తదితరులు కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.












