కామారెడ్డి, 2026-06-05
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై ఆంజనేయులు రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన రాజంపేట ఎస్సై ఆంజనేయులు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి అడ్డదారిలో డబ్బులు వసూలు చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రానికి చెందిన ఒక వ్యక్తి తన కేసు విషయంలో స్టేషన్ బెయిల్ నిమిత్తం రాజంపేట ఎస్సై ఆంజనేయులును ఆశ్రయించాడు. ఎస్సై ఆంజనేయులు పని చేసి పెడతానంటూ రూ. లక్ష డిమాండ్ చేశాడు. చివరికి రూ. 50 వేలకు ఒప్పందం కుదిరింది.
ఏసీబీ అధికారుల ప్రణాళిక
బాధితుడు గతంలో రూ. 20 వేలు ముట్టజెప్పాడు. మిగిలిన రూ. 30 వేలు ఇచ్చే క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పథకం ప్రకారం కామారెడ్డిలోని ఎన్జీవోల నివాసంలో బాధితుడి నుంచి రాజంపేట ఎస్సై ఆంజనేయులు రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.












