డిపాజిట్' (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 31
నారాయణవనం మండలం, భీమునిచెరువు గ్రామానికి చెందిన కెమిస్ట్రీ అధ్యాపకుడు బాలిగాని హరిబాబు (37) గత మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబానికి చేయూతగా ప్రైవేటు టీచర్ అసోసియేషన్ కన్వీనర్ సనత్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించారు.
నారాయణవనం మండలం, భీమునిచెరువు గ్రామానికి చెందిన బాలిగాని హరిబాబు (37) గత మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పుత్తూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మీ (27), ముగ్గురు కుమారులు ఉన్నారు.
సమాచారం అందుకున్న ప్రైవేటు టీచర్ అసోసియేషన్ కన్వీనర్ సనత్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సిబ్బంది బుధవారం ఆయనకు నివాళి అర్పించారు. మన సహోద్యోగి దివంగత శ్రీ బి. హరిబాబు గారి అకాల మరణం తీరని లోటు అని, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ₹1,06,000 మొత్తాన్ని రెండేళ్ల కాలపరిమితితో (₹1,14,582) 'ఫిక్స్డ్ డిపాజిట్'లో చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులకి, ₹20,000 రూపాయలు సహాయం అందించిన రాష్ట్ర మాజీ మంత్రి ఆర్.కె. రోజా సెల్వమణికి, వేదవ్యాసా విద్యాసంస్థల కరస్పాండెంట్ వేదవ్యాస్ ₹10,000, ఆర్థిక సహాయం అందించిన మరెందరో దాతలకు కన్వీనర్ సనత్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ మొత్తాన్ని బాండ్ పేపర్స్‌ను గురువారం సాయంత్రం వారి నివాసంలో కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నగరి కన్వీనర్స్ వి. సనత్ కుమార్, సయ్యద్ ఖాజాఫీర్, వేదవ్యాసా విద్యాసంస్థల కరస్పాండెంట్ వేదవ్యాస్, యువరాజ్, ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
మానవ సేవే - మాధవ సేవ అని, దిద్దే అంబేద్కర్ PTLU రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డ౦రాజు మరియు జిల్లా అధ్యక్షులు నేషత్ ఖాన్ నగరి PTLU సభ్యులను అభినందించారు.












