లక్ష్మణచాంద, 2026-06-05
అంగనవడీ కేందంో బుధవం త వోతసవనన ఘనంగ నవహంచు. ఈ కయకమంో గొనన సంచ ుష, త ముఖయతను, శశువు ఆోగయనక అవ ఎంత కీకమో వవంచు. తొ ఆు నెు కేవం తు మతమే ఇవవన సూచంచు.
పార్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపాల వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్ పల్లి సర్పంచ్ పుష్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిపాలు శిశువులకు అత్యంత శ్రేష్ఠమైన ఆహారమని, పుట్టిన వెంటనే తల్లిపాలను అందించడం వల్ల పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందని తల్లులకు అవగాహన కల్పించారు. అలాగే, శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం అత్యంత అవసరమని వివరించారు.
అన్నప్రాశన కార్యక్రమం
అనంతరం చిన్నారులకు అన్నప్రాశన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పుష్ప మాట్లాడుతూ, ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని, పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు తల్లిపాలే బలమైన పునాది అని అన్నారు.
విజయవంతంగా కార్యక్రమం
అంగన్వాడీ టీచర్లు విజయ, సునీత, లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్ఈవో నటరాజ్ గౌడ్, ఏఎన్ఎంలు కళ్యాణి, వనజ, ఆశా వర్కర్లు కళా, రామ, గంగామణి, తల్లిదండ్రులు, గ్రామస్తులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.












