బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 04
బోథ్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం-2లో మంగళవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య పరిరక్షణలో వాటి పాత్రపై తల్లులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో మాట్లాడిన అధికారులు, శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు. తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల బిడ్డకు అవసరమైన పోషకాలు అందుతాయని వివరించారు.
తల్లిపాల వల్ల శిశువుల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఎదుగుతారని అధికారులు పేర్కొన్నారు. సంపూర్ణ ఆహారంగా తల్లిపాలను పరిగణించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీడీపీవో నరసమ్మ, పర్యవేక్షకురాలు మౌనిక, అంగన్వాడీ టీచర్ సుమలత పాల్గొన్నారు.
బోథ్ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ మహేందర్, ఉప సర్పంచ్ విజయలక్ష్మి, తల్లులు, చిన్నారులు, కాలనీవాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.