హైదరాబాద్, జులై 20
ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు, ఎంపీల పిరాయింపుల నేపథ్యంలో దేశ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్రం 5 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, గతంలో పెండింగ్‌లో ఉన్న రెండు బిల్లులను ఆమోదించేందుకు ప్రయత్నించనుంది. ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు, ఎంపీల పిరాయింపుల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు సాగే ఈ ఉమ్మడి సమావేశాల్లో 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టడంతో పాటు, గతంలో పెండింగ్‌లో ఉన్న రెండు బిల్లులను ఆమోదించడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది.
ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పులు వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లుల్లో ఉండటంతో ఈ సెషన్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సమావేశాల్లో ప్రభుత్వం ముందుకు తీసుకురాబోతున్న ఐదు కొత్త బిల్లులలో దేశ ఆర్థిక, న్యాయ వ్యవస్థలపై ప్రభావం చూపే కీలక చట్టాలు ఉన్నాయి. అందులో మొదటిది దేశంలో ఐటీ రిఫార్మ్స్ తీసుకురావడానికి ఉద్దేశించిన ఆదాయపు పన్ను సవరణ బిల్లు కాగా, రెండోది సుప్రీంకోర్టులో కేసుల భారాన్ని తగ్గించేందుకు జడ్జీల సంఖ్యను పెంచేలా రూపొందించిన సుప్రీంకోర్టు సవరణ బిల్లు. ఈ రెండూ గతంలో తెచ్చిన ఆర్డినెన్స్‌ల స్థానంలో రానున్నాయి.
వీటితో పాటు జనన, మరణాల నమోదు ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు జనన, మరణాల నమోదు సవరణ బిల్లును, దేశ ప్రతిష్టను, జాతీయ చిహ్నాలను కించపరిచే వారిపై కఠిన చర్యల కోసం జాతీయ గౌరవానికి భంగం కలిగించకుండా నిరోధించే సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు.
అలాగే దేశీయంగా చిన్న పరిశ్రమలను బలోపేతం చేసేందుకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా తీసుకువస్తున్నారు. ఇవే కాకుండా గతంలో పార్లమెంట్ ముందుకొచ్చి పెండింగ్‌లో ఉన్న విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లులను కూడా ప్రభుత్వం ఈ సెషన్లో ఆమోదించుకోవాలని చూస్తోంది.












