నిర్మల్, జూలై 7
నిర్మల్ ఆర్టీసీ డిపో కార్గో సేవల ద్వారా బుక్ చేయబడి, గమ్యస్థానాలకు చేరినప్పటికీ ఇంకా ఎవరూ స్వీకరించని పార్సిల్ వస్తువులను ఈనెల 9న బహిరంగ వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ కె. పండరీ తెలిపారు. ఈ వేలం నిర్మల్ డిపో ఆవరణలో ఉదయం 11 గంటలకు జరగనుంది.
నిర్మల్ ఆర్టీసీ డిపో కార్గో సేవల ద్వారా బుక్ చేసి, గమ్యస్థానాలకు చేరినప్పటికీ స్వీకరించని పార్సిల్ వస్తువులను ఈనెల 9న బహిరంగ వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ కె. పండరీ తెలిపారు.
ఈ వేలం ప్రక్రియ ఈనెల 9వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్మల్ డిపో ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వేలంలో ఉంచే వస్తువుల కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి హాజరై, నేరుగా వేలంలో పాల్గొని వస్తువులను కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
వేలం ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నిర్మల్ ఆర్టీసీ డిపో కార్యాలయాన్ని సంప్రదించాలని డిపో మేనేజర్ సూచించారు.












