నిజామాబాద్, 2026-08-22
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరా మరియు విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ డ్రగ్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన రూ.5.15 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాల అక్రమ తయారీ, రవాణా, సరఫరా మరియు విక్రయాలకు పాల్పడుతున్న వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోంది. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్, గారి ఆదేశాల మేరకు, బోధన్ ఏసీపీ శ్రీ పి. శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో బోధన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ డి. విజయ్ బాబు ఆధ్వర్యంలో చేపట్టిన దర్యాప్తులో అంతర్రాష్ట్ర ఆల్ప్రాజోలం తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో డ్రగ్ అక్రమ రవాణా ద్వారా సంపాదించిన రూ.5.15 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు పోలీస్ కమీషనర్ వెల్లడించారు.
గత ఏడాది అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్ల అరెస్ట్
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆల్ప్రాజోలం తయారీ, సరఫరాకు పాల్పడుతున్న ఐదుగురు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లపై గత సంవత్సరం ..148/2025గా చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 2.5 కిలోల ఆల్ప్రాజోలం, దాని విలువ సుమారు రూ.25 లక్షలు, కారు (-14--7889), 8 మొబైల్ ఫోన్లు, రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలో అక్రమ ఆల్ప్రాజోలం తయారీ కేంద్రం గుర్తింపు
కేసు దర్యాప్తులో భాగంగా నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారించగా ఆల్ప్రాజోలం తయారీ, సరఫరాకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు బోధన్ రూరల్ సీఐ శ్రీ డి. విజయ్ బాబు ఆధ్వర్యంలో సుమారు 15 మంది పోలీసు సిబ్బందితో ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లి వారం రోజుల పాటు విస్తృతంగా దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో మహారాష్ట్రలోని సతారా పారిశ్రామిక ప్రాంతంలో, సూర్య ప్రభ ఫార్మా కెమ్ పేరుతో ఎరువుల తయారీ కోసం అనుమతులు పొంది, అక్రమంగా ఆల్ప్రాజోలం తయారు చేస్తున్న ఫ్యాక్టరీని గుర్తించారు. అక్కడ నిర్వహించిన సోదాల్లో సుమారు 30 కిలోల ఆల్ప్రాజోలం, దాని విలువ సుమారు రూ.3 కోట్లు, అక్రమంగా సంపాదించిన రూ.12 లక్షల నగదు, ఒక ఫోర్డ్ కారును స్వాధీనం చేసుకుని, అక్రమంగా నిర్వహిస్తున్న ఫ్యాక్టరీని సీజ్ చేశారు.
డ్రగ్ డబ్బుతో కూడబెట్టిన ఆస్తులపై జప్తు చర్యలు
నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు, వారు మాదకద్రవ్యాల అక్రమ వ్యాపారం ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించి జప్తు చేయడంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పూణే, సతారా, అహ్మద్‌నగర్ జిల్లాల్లో సంబంధిత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాలను సంప్రదించి నిందితులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలను సేకరించారు. నిందితులు 1 ఆమర్‌సింగ్, 2 బసవరాజ్, 5 లక్ష్మణ్ గౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు ఆల్ప్రాజోలం అక్రమ విక్రయాల ద్వారా సంపాదించిన ఆస్తులను గుర్తించారు. ప్రభుత్వ విలువల ప్రకారం సుమారు రూ.5.15 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించగా, బహిరంగ మార్కెట్లో వాటి విలువ మరింత ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంబంధిత , మరియు , వారి ద్వారా , 68(2) కింద ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి.












