బెంగళూరు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 22
బెంగళూరులో ఓ మహిళా పోలీస్ అధికారిణి వీడియో కాల్లో బట్టలు విప్పుతూ మాట్లాడిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో లీకై తీవ్ర కలకలం సృష్టించాయి. పోలీసులు జరిపిన సమగ్ర విచారణలో, ఆ మహిళ కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ () కు చెందిన ఇన్స్పెక్టర్గా గుర్తించారు.
బెంగళూరులో ఓ మహిళా పోలీస్ అధికారిణి వీడియో కాల్లో బట్టలు విప్పుతూ మాట్లాడిన దృశ్యాలు ఇటీవల సోషల్ మీడియాలో లీకై తీవ్ర కలకలం సృష్టించాయి. పోలీసులు జరిపిన సమగ్ర విచారణలో, ఆ మహిళ కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ () కు చెందిన ఇన్స్పెక్టర్గా గుర్తించారు. ఆమె హిండల్గా సెంట్రల్ జైలులో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, అక్కడే ఖైదీగా ఉన్న కుణిగల్ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ సాయికుమార్‌తో వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఈ దృశ్యాలు రికార్డైనట్లు తేలింది.
వీడియో లీక్, ఎదురు ఫిర్యాదు
2024లో రికార్డైన ఈ వీడియోను సాయికుమార్ ఇటీవల కావాలనే సోషల్ మీడియాలో లీక్ చేశాడు. దీంతో ఆ మహిళా ఇన్స్పెక్టర్ అతనిపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో, జైలు లోపల మొబైల్ ఫోన్, మద్యం, ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కల్పించేందుకు సదరు మహిళా ఇన్స్పెక్టర్ తన వద్ద భారీగా లంచం తీసుకున్నారని రౌడీ సాయికుమార్ కూడా బహిరంగంగా ఎదురు ఫిర్యాదు చేశాడు. అతడు లంచంగా ఇచ్చిన ఫోన్లోనే ఈ అశ్లీల వీడియో రికార్డయినట్లు మరింత దిగ్భ్రాంతికర విషయం బయటపడింది.
శాఖాపరమైన విచారణ
ప్రస్తుతం ఆ మహిళా ఇన్స్పెక్టర్ సెలవుపై వెళ్లగా, లంచం ఆరోపణల నేపథ్యంలో ఆమెపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. ఇదిలా ఉండగా, జైలు అధికారుల అవినీతిపై ఇన్‌స్టాగ్రామ్‌లో మరో వీడియో కూడా బయటకు రావడంతో బెలగావి సీఈఎన్ () పోలీసులు సైతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంచలనం రేపుతున్న ఘటన
ఒక రక్షక భట అధికారిణి అయి ఉండి, నేరస్థుడితో అక్రమ సంబంధం పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించిన ఈ ఘటన కర్ణాటక వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.












