బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
ఇచ్చోడ మండలం అడేగామ (బి) గ్రామానికి చెందిన ఆమ్టే జ్ఞానేశ్వర్ కుమారుడు ఆమ్టే ఈశ్వర్, నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన సందర్భంగా రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వైద్య వృత్తి పవిత్రతను, దాని ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని జాదవ్ ప్రస్తావించారు.
ఇచ్చోడ మండలం అడేగామ (బి) గ్రామానికి చెందిన ఆమ్టే జ్ఞానేశ్వర్ కుమారుడు ఆమ్టే ఈశ్వర్, ఇటీవల వెలువడిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించిన సందర్భంగా రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ఆయనను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బలరాం జాదవ్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి అత్యంత పవిత్రమైనదని, ఈ వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం లభిస్తుందని అన్నారు. ఈశ్వర్ భవిష్యత్తులో మంచి వైద్యుడిగా ఎదిగి, నిస్వార్థ సేవలతో తన గ్రామానికి, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
యువత పట్టుదలతో కష్టపడి శ్రమిస్తే ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. నేటి తరం యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.












