బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 12
భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పిలుపునిచ్చారు. ఆదివారం స్వాధ్యాయ భక్తులు దీదీజీ జన్మదినం సందర్భంగా వృక్షమందిర్ దిన్ కార్యక్రమంలో భాగంగా బైంసాలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు.
భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.
ఆదివారం స్వాధ్యాయ భక్తులు దీదీజీ జన్మదిన సందర్భంగా వృక్షమందిర్ దిన్ కార్యక్రమంలో భాగంగా బైంసాలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు.
పరమ పూజ్య పాండురంగ శాస్త్రి బోధనలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేశాయని, ఆ బాటలో మార్గదర్శనం చేస్తున్న దిదీజీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం ఒక మహాకార్యమని ఆయన అన్నారు.
'వృక్షో రక్షతి రక్షితః' అన్న మాటలతో మన ముందుకెళ్లాలని, ప్రతి ఒక్కరూ వన సంరక్షణకు పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.
భావితరాలు బాగుండాలంటే మన సంరక్షణ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో స్వాధ్యాయ భక్తులు, నాయకులు పాల్గొన్నారు.












