మిర్యాలగూడ మండలం టిక్యాతండాలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో నిర్వహించనున్న మెయింటెనెన్స్ పనుల నేపథ్యంలో, బుధవారం ఉదయం 7:00 గంటల నుండి 10:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది.
మిర్యాలగూడ మండలం టిక్యాతండాలో ఉన్న 220/132/33కెవి ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో అత్యవసర మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నారు. ఈ కారణంగా, 33/11కెవి ఆర్సి గూడెం, 33/11KV మిర్యాలగూడ పట్టణ సబ్ స్టేషన్, 33/11కేవీ ఇందిరమ్మ కాలనీ సబ్స్టేషన్, 33/11కేవీ ఈదులగూడెం, మరియు 33/11కేవీ ఎఫ్సీఐ సబ్ స్టేషన్ల పరిధిలోని అన్ని ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
మిర్యాలగూడ విద్యుత్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసచారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ అంతరాయం ఉదయం 7:00 గంటలకు ప్రారంభమై 10:30 గంటల వరకు కొనసాగుతుంది. పట్టణంలోని అనేక ప్రాంతాలతో పాటు, సమీప గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా ప్రభావితం కానుంది.
విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాలలో ఏడుకోట్లతండా, ఆర్సిగూడెం, బైపాస్, యాద్గార్పల్లి ఏజిఎల్, బంగారుగడ్డ, సీతారాంపురం, డాక్టర్స్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, అశోక్ నగర్, శాంతినగర్, గాంధీనగర్, హనుమాన్ పేట, వాసవినగర్, కృష్ణా మానసకాలనీ, ఇందిరమ్మ కాలనీ, విద్యానగర్, కాల్వగట్టు, వాల్యతాండ, అగ్రిగోల్డ్, ఈదులగూడెం, శ్రీనగర్ కాలనీ, యాద్గారిపల్లి, ఏజ్ఎల్ ఉట్లపల్లి, ఇండస్ట్రియల్, చైతన్యనగర్, రాంనగర్, కలలవాడ, రాజీవ్ నగర్, భాగ్యనగర్ కాలనీ, తాళ్లగడ్డ, శాబునగర్, ఇస్లాంపురం, ప్రకాశనగర్, బాపూజీనగర్, ఎఫ్సీఐ ఏరియాలు ఉన్నాయి.
ఈ విద్యుత్ అంతరాయం గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలతో పాటు వ్యవసాయ రంగంపై కూడా ప్రభావం చూపుతుంది. వినియోగదారులు ఈ అంతరాయాన్ని అర్థం చేసుకుని, విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరడమైనది.












