స్థలం కబ్జా నుండి కాపాడండిమాభూమి మాకు ఇప్పించండి :
👉కోర్టు ఆదేశాలు అమలు చేయాలి :
మిర్యాలగూడ ఆగస్టు 6 (మనోరంజని తెలుగు టైమ్స్)
కోర్టు ఆదేశాల అమలు చేసి మా భూమి మాకు ఇప్పించి కబ్జా నుండి భూమిని కాపాడాలని బాధిత మహిళలు నక్కేంటి లక్ష్మీ,వల్లంశెట్టి దుర్గా భవాని కోరారు. మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్ నగర్ గ్రామంలో తమకు అనుకూలంగా డిక్రీ వచ్చిన భూమి వద్ద కోర్టు ఆదేశాలు చూపిస్తూ నిరసన వ్యక్తంచేశారు.గ్రామంలో 237 సర్వే నంబర్ లో నాలుగున్నర గుంటల ఇంటి స్థలం ఉన్నదని దానిని గ్రామానికి చెందిన ఓ ప్రజాపతినిధి కబ్జా చేశాడని తెలిపారు.గత 15 ఏళ్లుగా కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నామని ఇప్పుడు కోర్టు ఆ భూమి మాదేనని డిక్రీ ఇచ్చిందన్నారు. కానీ కబ్జాలో ఉన్న వ్యక్తులు మాకు భూమి మీద రానివ్వడం లేదన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేసి మా భూమి మాకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు.











