నిజామాబాద్, 2026-08-06
కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15) అనే బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కమ్మర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్. సతీష్, సిబ్బందితో కలిసి వెంటనే విచారణ చేపట్టారు.
కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15) అనే బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్డారు. వెంటనే కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కమ్మర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ సిహెచ్. సతీష్, సిబ్బంది కానిస్టేబుల్స్ నరేష్, దినేష్, హరీష్‌లతో కలిసి వెంటనే విచారణ చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్ కీలకం
పోలీసులు సీసీటీవీ కెమెరాల దృశ్యాలను నిశితంగా పరిశీలించి, బాలుడి కదలికలను ట్రాక్ చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే ఆ బాలుడు ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్నట్లు గుర్తించారు.
క్షేమంగా అప్పగింత
గుర్తించిన బాలుడిని క్షేమంగా పోలీస్ స్టేషన్‌కు తరలించి, అనంతరం ఆయన తల్లిదండ్రుల సమక్షంలో వారికి సురక్షితంగా అప్పగించారు.
ప్రజల ప్రశంసలు
బాలుడు అదృశ్యమైన వెంటనే అత్యంత వేగంగా స్పందించి, గంటల వ్యవధిలోనే తమ బిడ్డను క్షేమంగా అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు కమ్మర్పల్లి ఎస్సై సిహెచ్. సతీష్ గారికి, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.
కమిషనర్ అభినందన
ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో పుంజుకున్న నేపథ్యంలో, కమ్మర్పల్లి ఎస్సై సీసీటీవీ కెమెరాలను అన్ని ప్రాంతాలలో గమనించి, స్థానికేతరుల సహాయ సహకారాలతో బాలుడిని తక్కువ సమయంలో వారి తల్లిదండ్రులకు అప్పగించినందుకు, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., కమ్మర్పల్లి ఎస్సై శ్రీ సిహెచ్. సతీష్‌ను అభినందించి, ప్రశంసించారు.










