తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులందరికీ బోనాల పండుగ సందర్భంగా మనోరంజని తెలుగు టైమ్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ పవిత్ర పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలుపుతోంది.
జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంటిలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రతి కుటుంబం ఆనందాలతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పేర్కొంది. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తూ, భక్తి, విశ్వాసం, ఐక్యతకు ప్రతీకగా బోనాల పండుగ మరింత వైభవంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది.
ఈ సందర్భంగా మనోరంజని తెలుగు టైమ్స్ దినపత్రిక & న్యూస్ ఛానెల్ చైర్మన్ సూర్యవంశీ మాధవరావు పటేల్, తెలంగాణ బ్యూరో ఇన్చార్జ్ అసం రాజశేఖర్, నిర్మల్ బ్యూరో ఇంచార్జ్ మార్గం గిరి ప్రసాద్, ఖానాపూర్ డివిజన్ ఇంచార్జ్ గుడిసె శ్రావణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇంకా, తక్కువ ధరలో వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్, యూట్యూబ్ షార్ట్స్, ప్రకటనలు, ఈవెంట్ కవరేజ్, ప్రత్యేక వీడియోలు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఇవ్వబడతాయని, మరిన్ని వివరాలకు 8185011375 నంబర్‌ను సంప్రదించాలని సూచించింది.












