బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
బైంసా పట్టణంలోని రామ్ లీలా మైదానంలో నిర్మించనున్న శివ రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. గురువారం బైంసాలోని తన నివాసంలో అక్కడి వాసులకు మంజూరు పత్రాన్ని అందజేశారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
బైంసా పట్టణంలోని రామ్ లీలా మైదానంలో నిర్మించనున్న శివ రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. గురువారం బైంసాలోని తన నివాసంలో అక్కడి వాసులకు మంజూరు పత్రాన్ని అందజేశారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్ చింతపండు రజిత మహేష్ మాట్లాడుతూ భైంసా పట్టణంలో రామ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించడం శుభసూచకమని, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హయాంలోనే బైంసా పట్టణానికి పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు.
అనంతరం నిధులు మంజూరు చేసినందుకు కౌన్సిలర్‌తో పాటు కాలనీవాసులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు రావుల రాము, కౌన్సిలర్ అమోల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.












