** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 16
లోకేశ్వరం మండలంలోని వటోలి గ్రామంలో ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి 23 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామరావ్ పటేల్ తెలిపారు. భైంసాలోని తన నివాసంలో వటోలి గ్రామస్తులకు మంజూరు పత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని, ఆలయ నిర్మాణం శుభసూచకమని పేర్కొన్నారు.
లోకేశ్వరం మండలంలోని వటోలి గ్రామంలో ఎల్లమ్మ దేవాలయ నిర్మాణానికి 23 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసినట్లు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. గురువారం భైంసాలోని తన నివాసంలో వటోలి గ్రామస్తులకు మంజూరు పత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
త్వరలో పనులు ప్రారంభమవుతాయని, శక్తిస్వరూపుని ఎల్లమ్మ ఆలయ నిర్మాణం కావడం శుభసూచకమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన లోకేశ్వరం మండల బిజెపి అధ్యక్షులు, వటోలి మాజీ సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే పటేల్ నిరంతరం దృష్టి సారిస్తున్నారని, రెండున్నర సంవత్సరాల్లో లోకేశ్వరం మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్ల నిర్మాణానికి కోట్లాది రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, అభివృద్ధి ప్రదాత రామరావ్ పటేల్ కు ఎప్పుడూ రుణపడి ఉంటామని సాయన్న అన్నారు.
అనంతరం ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వటోలి గ్రామస్తులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.












