మామడ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 04
నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలానికి చెందిన మామడ, దిమ్మదుర్తి, కప్పన్‌పల్లి, పాన్కాల్ గ్రామాలకు ఎత్తిపోతల సాగునీటి పథకాలు మంజూరు చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ, ఆయా గ్రామాల రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమీపంలోని సదర్మట్ ఆనకట్ట, సరస్వతి కాలువ, తుర్కం చెరువు నుంచి ఎత్తిపోతల పద్ధతిలో సాగునీరు అందించే అవకాశం ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మేరకు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి, సమగ్ర ప్రణాళిక రూపొందించి, ఎత్తిపోతల సాగునీటి పథకాలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని కోరారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రతిపాదనపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, కాలగిరి గంగారెడ్డి, లింగారెడ్డి, మాజీ మండల ప్రజా పరిషత్ సభ్యుడు సయ్యాద్ అన్వర్, మాజీ మండల ప్రజా పరిషత్ సభ్యుడు నల్దుర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు.