నందుర్బార్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 09
మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో మైనర్లు, యువకులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు పాల్పడుతూ, వారి వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు 22 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే
నందుర్బార్ జిల్లాలోని రైసింగ్పురాకు చెందిన చేతన్ ప్రకాష్ కోలి అనే యువకుడు మైనర్లు, యువకులను డబ్బు ఆశ చూపి తన వలలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ స్వాధీనం
నిందితుడి మొబైల్ ఫోన్ను పరిశీలించగా అందులో పెద్ద సంఖ్యలో అభ్యంతరకరమైన వీడియోలు, ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. అతడి ఫోన్ నుంచి 600కు పైగా అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నట్లు నందుర్బార్ పోలీస్ సూపరింటెండెంట్ అశ్విని సనాప్ వెల్లడించారు.
జాగ్రత్తగా దర్యాప్తు
మైనర్లకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు దర్యాప్తును అత్యంత జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. నిందితుడిపై మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.