మచిలీపట్నం, 2026-06-05
కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మచిలీపట్నంలో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
కృష్ణాజిల్లా పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు మైనర్ బాలికలపై ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నెల 6వ తేదీన గురుకుల పాఠశాల నుండి మచిలీపట్నం వచ్చిన బాలికలు, తమ పరిచయస్తుడికి ఫోన్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఘటన వివరాలు
బాలికలు ఫోన్ చేసిన సమాచారంతో, ఒక ఆటో డ్రైవర్ తన స్నేహితుడితో కలిసి కోనేరు సెంటర్ వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు బాలికలను ఎక్కించుకుని రుద్రవరం వెళ్ళాడు. అక్కడ నిర్మానుషంగా ఉన్న టిడ్కో గృహాల్లోకి బాలికలను తీసుకువెళ్లి, ఆటో డ్రైవర్ తో పాటు అతని స్నేహితుడు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాలికల ఆరోపణ
మరుసటి రోజు రక్తస్రావంతో అస్వస్థతకు గురైన బాలికను అనుమానంతో తల్లిదండ్రులు నిలదీయగా, జరిగిన ఘోరాన్ని కన్నీటి పర్యంతమై వివరించింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పెడన పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తు
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, పెడన, బందరు రూరల్ పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.












