లోకేశ్వరం, 6 September
నిర్మల్ జిల్లా మండలం బామిని(కే) గ్రామానికి చెందిన తొడు శ్రావణ్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక దుర్వినియోగ దృశ్యాలను వీక్షించడం, డౌన్లోడ్ చేయడం, అప్లోడ్ చేసిన ఘటనలో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. క్రైమ్ నెం. 109/2026 కింద ఐటీ చట్టం సెక్షన్ 67(బి) ప్రకారం కేసు నమోదైంది.
ఇన్స్టాగ్రామ్లో బాలల అశ్లీల దృశ్యాలు: యువకుడిపై కేసు నమోదు సామాజిక మాధ్యమం ఇన్స్టాగ్రామ్లో బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన దృశ్యాలను వీక్షించడం, డౌన్లోడ్ చేయడం మరియు అప్లోడ్ చేసిన ఘటనలో ఒక యువకుడిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా మండలం బామిని(కే) గ్రామానికి చెందిన తొడు శ్రావణ్ అనే యువకుడు ఇన్స్టాగ్రామ్లో బాలల అశ్లీల దృశ్యాలను చూస్తూ, షేర్ చేస్తున్నట్లు సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచిన పోలీసులు డిజిటల్ ఆధారాల ద్వారా గుర్తించారు. దీంతో ఆయనపై క్రైమ్ నెం. 109/2026 కింద సమాచార సాంకేతిక చట్టం (IT Act) లోని సెక్షన్ 67(బి) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రదీప్ మాట్లాడుతూ.. బాలల లైంగిక దుర్వినియోగ దృశ్యాలను చూడటం, భద్రపరచడం లేదా ఇతరులకు పంపడం చట్టవిరుద్ధమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వాటిని ఎవరికీ ఫార్వర్డ్ చేయవద్దని ఆయన సూచించారు.












