బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
కుచలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారు, కాళీమాత, చండీమాత, పోతరాజుల వేషధారణలో పాల్గొని, సంగీత వాయిద్యాలు, భక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
కుచలాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే విద్యార్థులు నూతన వస్త్రాలు ధరించి, తమ ఇళ్లలో సిద్ధం చేసిన బోనాలను పాఠశాలకు తీసుకువచ్చారు.
అనంతరం, సంగీత వాయిద్యాల నడుమ గ్రామం లోని ప్రధాన వీధుల గుండా బోనాల ఊరేగింపును నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారు, కాళీమాత, చండీమాత, పోతరాజుల తదితర దేవతల వేషధారణలో పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు. భక్తి గీతాలు, సాంప్రదాయ నృత్యాలతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రణధీర్, అంగన్వాడి టీచర్ కళావతి, అటెండర్లు గోదల శంకర్, మంత్రి రమ్య, విద్యార్థులు పాల్గొన్నారు.












