బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 18
బోథ్ పట్టణంలో కొట్టాల పోచమ్మ ఆషాఢ మాస బోనాల జాతర పోస్టర్ను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు. ఆగస్టు 2వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్న ఈ జాతరలో ఆధ్యాత్మిక నృత్యాలు, పోతురాజు విన్యాసాలు, బోనాల ఊరేగింపులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
బోథ్ పట్టణ కేంద్రంలోని పాత సినిమా టాకీస్ సమీపంలో ఏర్పాటు చేసిన కొట్టాల పోచమ్మ ఆషాఢ మాస బోనాల జాతర పోస్టర్ను శనివారం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ మరియు ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆగస్టు 2వ తేదీ (ఆదివారం) న బోథ్ పట్టణంలో కొట్టాల పోచమ్మ ఆషాఢ మాస బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జాతరలో శివశక్తుల ఆధ్యాత్మిక నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు, సంప్రదాయ బోనాల ఊరేగింపులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కావున బోథ్ పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందడంతో పాటు జాతరను విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.












