మిర్యాలగూడలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో పలు ర్యాంకులను సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ విజయం కళాశాల ప్రతిష్టను మరింత పెంచింది.
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కేఎల్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ, బైపీసీ విభాగాలతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విభాగాలలోనూ విద్యార్థులు ఉన్నత ర్యాంకులను సాధించారు.
సెకండ్ ఇయర్ ఎంపీసీలో డి. దీప్తి 994/1000, కె. మహతి 991/1000, బి. ప్రవీణ్ 989/1000 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ బైపీసీలో కే. మేఘన 992/1000, ఎన్. సిరి 985/1000 మార్కులు సాధించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం బైపీసీలో బి. సిరి 438/440, అయాన్ 436/440, డి. భార్గవి 432/440, జె. చందన 431/440, బి. సాయి నాగేంద్ర 429/440 మార్కులు సాధించగా, ఎంపీసీలో టి. హన్సిక రెడ్డి, జి. శ్రావణి, ఎన్. ఎన్. జాన్వి 466/470 మార్కులతో జిల్లాలోనే అగ్రగామిగా నిలిచారు.
కే. హిమావర్షిని 464/470, ఆర్. శివమణి, అష్రాఫ్ అలీ 461/470 మార్కులతో జిల్లా స్థాయి ర్యాంకులను కైవసం చేసుకున్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించి, స్వీట్లు తినిపించి ప్రోత్సహించింది.












