నిర్మల్ జిల్లా ముధోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో సభ్యులందరూ పాల్గొని నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా జోంధాలే సునీల్, ఉపాధ్యక్షులుగా సొన్కాంబ్లే రాహుల్, ప్రధాన కార్యదర్శిగా ముఫ్తీ రైసోద్దీన్, కార్యదర్శిగా దొంతుల్వార్ రమేష్, సంయుక్త కార్యదర్శిగా శరత్ గాయక్ వాడ్ ఎన్నికయ్యారు. వీరితో పాటు పలువురు సభ్యులు కూడా ఎన్నికయ్యారు.
నూతన అధ్యక్షులు జోంధాలే సునీల్ మాట్లాడుతూ, ప్రతి సభ్యునికి అండగా ఉంటానని, అందరి సుఖ సంతోషాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. ముఖ్యంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, సభ్యులందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
సభ్యులు నియమ నిబంధనలకు లోబడి ముందుకు సాగాలని, సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడితే విజయం సాధించవచ్చని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సభ్యులందరూ తమ ఐక్యతను చాటుకున్నారు.
ఈ ఎన్నిక కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో దుర్గాప్రసాద్, మురళిగౌడ్, తిరుపతి గౌడ్, విజయ్, పి.నాగేష్, జాదవ్ నాగేష్, జాదవ్ పవన్, బషీర్, అజీమ్, సుభాష్, గంగారెడ్డి తదితరులు ఉన్నారు.








