రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఖానాపూర్ పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
కాలనీలలో వరద సమస్యలు, పాత మట్టి పెంకుటిల్లలో నివాసం ఉంటున్న కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని, వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. పిల్లలు, పెద్దలు ఎవరూ కూడా ఇళ్లలో గానీ, బయట గానీ ఉన్న విద్యుత్ వైర్లకు, స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు.
వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కాలనీలలో ఏదైనా సమస్య ఉంటే మున్సిపాలిటీ కార్యాలయం నుండి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 📞918730293005 కు ఫోన్ చేసి వివరించవచ్చని, అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారని అన్నారు.
కార్యాలయ పని వేళల్లో మాత్రమే టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత అత్యవసర సమస్యల కోసం మున్సిపాలిటీ సోనిటేషన్ ఇన్స్పెక్టర్ ఉప్పరి పోశెట్టి (9177475055) లేదా మున్సిపాలిటీ శానిటేషన్ జవాన్ మానాల శంకర్ (9948045865) ను సంప్రదించాలని తెలిపారు.












