ఖానాపూర్, జూలై 29
నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఖానాపూర్ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. వరద ముప్పు ఏర్పడిన ప్రాంతాలను నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం స్థానికులతో కలిసి ఈరోజు పరిశీలించారు.
ఖానాపూర్ పట్టణంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలలో వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గౌరవ నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం కాలనీ వాసులతో కలిసి ఈరోజు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలలో వరద నీరు వచ్చి ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. జేసీబీ సహాయంతో వరద నీటిని దిగువ ప్రాంతానికి పంపి కాలనీవాసులకు ఇబ్బంది లేకుండా చేశామని చెప్పారు. ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యను పరిష్కరిస్తామని, ప్రజాసేవ చేయడానికి తామున్నామని అన్నారు.
భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా కాలనీవాసులు చెప్పగానే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన సత్యం అన్న గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.












