కడం (పెద్దూర్), 2026-07-29
ఖానాపూర్ పట్టణంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, పలు కాలనీలలో ఏర్పడిన వరద ముంపు ప్రాంతాలను నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం గారు ఈరోజు స్థానికులతో కలిసి సందర్శించారు. ప్రజల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
ఖానాపూర్ పట్టణంలో నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలలో వరద ముప్పు ఉన్న ప్రాంతాలను గౌరవ నిర్మల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు, ఖానాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం గారు కాలనీ వాసులతో కలిసి ఈరోజు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిన్న రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు కాలనీలలోకి వరద నీరు వచ్చి ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. జేసీబీ సహాయంతో వరద నీటిని దిగువ ప్రాంతానికి పంపి కాలనీవాసులకు ఇబ్బంది లేకుండా చేశామని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యను పరిష్కరిస్తామని, ప్రజాసేవ చేయడానికి తామున్నామని అన్నారు.
భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా కాలనీవాసులు చెప్పగానే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన సత్యం అన్న గారికి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.












