*_బిజెపి (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 03
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ()లో అధికారుల నిర్లక్ష్యంపై బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గడువు ముగిసిన తర్వాత నోటీసులు ఇవ్వడం, ప్రజలను అయోమయానికి గురిచేయడం సరికాదని ఆయన అన్నారు. అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా ఎన్నికల అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు.
*_SIR ప్రక్రియపై తప్పుడు ఆలోచనలు ఓటర్లకు కలిగేలా అధికారులు ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదు!_* *_గడువు ముగిసిన తర్వాత నోటీసులు ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం!_* *_నోటీసు ఇచ్చే తేదీ ఒకటి.. నోటీసు అందే తేదీ మరొకటి.. సమాధానం చెప్పాల్సిన గడువు అప్పటికే ముగిసిపోవడం వల్ల నోటీసులు అందుకొన్న ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు!_* *_ప్రజలకు అవగాహన కల్పించవల్సిన అధికారులు ప్రజలనే అయోమయానికి గురిచేస్తే ఎలా? ఓటుహక్కు తో ఆటలాడితే సహించేది లేదని👇_* జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం హెచ్చరించారు_* *_ఖమ్మం వేంకటేశం మాట్లాడుతూ.. SIR ప్రక్రియలో భాగంగా ఫారాలు సక్రమంగా నింపలేదని వివరాల్లో తప్పులు ఉన్నాయని కొంతమంది ఓటర్లకు అధికారులు BLO లు నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు ఇవ్వడాన్ని మేము తప్పుపట్టడం లేదు. కానీ ఓటరికి నోటీసు అందే సమయానికే అందులో పేర్కొన్న సమాధానం గడువు ముగిసిపోతే.. ఆ ఓటరు తన వాదనను ఎలా వినిపించాలి? ఎక్కడ వినిపించాలి ఇది అధికారుల నిర్లక్ష్యం కాదా?_* *_ప్రజలకు నోటీసులు జారీ చేసినట్లు రికార్డుల్లో చూపించి వాస్తవంగా మాత్రం గడువు ముగిసిన తర్వాత నోటీసులు అందించడం వల్ల సామాన్య ఓటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై అవగాహన లేని ప్రజలు ఏమి చేయాలో తెలియక అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. BLOలకు కనీస అవగాహన అధికారులు కల్పిస్తాలేరా? కల్పించిన BLO లే తప్పులు చేస్తున్నారా?_* *_SIR ప్రక్రియ అత్యంత కీలకమైనది డెత్ ఓటర్లు, దొంగఓటర్లు, డబుల్ ఓటర్లు, ఏరివేత చేసేందుకు చేసే ప్రక్రియను ప్రతి BLOకి తమ పరిధిలోని ఓటర్లకు సరైన సమాచారం అందించే బాధ్యత ఉంది. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది BLOలకు SIR ప్రక్రియపై పూర్తి అవగాహన లేకపోవడం, ప్రజలకు సరైన మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి_* *_ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులు.. ప్రజలనే అయోమయానికి గురిచేస్తే ఎలా? ఓటర్లకు నోటీసులు ఇవ్వడం మాత్రమే కాదు.. నోటీసు ఎందుకు ఇచ్చారు? ఏ పత్రాలు సమర్పించాలి? ఎక్కడ సమర్పించాలి? ఎంత గడువు ఉంది? అనే విషయాలను స్పష్టంగా తెలియజేయాలి ఓటు హక్కుతో ఆటలాడితే సహించేది లేదు_* *_ఓటు అనేది కేవలం ఒక గుర్తు కాదు.. అది ప్రతి భారత పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. SIR ప్రక్రియ పేరుతో అర్హులైన ఒక్క ఓటరు కూడా ఇబ్బందులకు గురికాకూడదు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి_* *_గడువు ముగిసిన తర్వాత నోటీసులు అందుకున్న ఓటర్లకు వెంటనే అదనపు సమయం ఇవ్వాలి. వారి వివరణలు, అభ్యంతరాలు, అవసరమైన పత్రాలను స్వీకరించాలి. ఏ ఒక్క ఓటరికి అన్యాయం జరగకుండా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి_* *_ఎన్నికల అధికారులకు మా డిమాండ్లు గడువు ముగిసిన తర్వాత నోటీసులు అందుకున్న ప్రతి ఓటరికి అదనపు గడువు ఇవ్వాలి. SIRపై ప్రతి BLOకి పూర్తిస్థాయి అవగాహన, శిక్షణ కల్పించాలి. నోటీసులు జారీ చేసిన తేదీ, ఓటరికి అందిన తేదీ, సమాధానం ఇవ్వాల్సిన గడువుపై పారదర్శకత పాటించాలి. ప్రజలకు SIR ప్రక్రియపై గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. అధికారుల తప్పిదం వల్ల ఏ అర్హుడైన ఓటరు నష్టపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి_* *_ప్రజాస్వామ్యంలో ఓటరే కీలకం. ఓటరిని ఇబ్బంది పెట్టే విధానం కాకుండా, ఓటరికి అండగా నిలిచే విధంగా SIR ప్రక్రియ కొనసాగాలి_* *_అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోతే బీజేపీ చూస్తూ ఊరుకోదు. ప్రజల తరఫున ప్రశ్నిస్తాం..అవసరమైతే ప్రజా ఉద్యమాన్ని చేపడతాం అని తెలియజేశారు_*












