అలప్పుజ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
కేరళలోని అలప్పుజలో జరిగిన దారుణ ఘటనలో, 13 ఏళ్ల మైనర్ బాలిక తన 17 ఏళ్ల ప్రియుడితో కలిసి తన తాతను హత్య చేయించింది. హత్య జరుగుతున్న దృశ్యాలను వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించింది. అనంతరం, తనకు ఏమీ తెలియదన్నట్లుగా నటించి, పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి, మైనర్లైన నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కుట్రకు దారితీసిన పరిస్థితులు
వివరాల్లోకి వెళితే, ఆగస్టు 15 రాత్రి, వృద్ధుడి భార్య, ఆయన చిన్న కుమార్తె ప్రసవం కోసం అలప్పుజ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లారు. దీంతో వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని, బాలిక తన ప్రియుడైన 17 ఏళ్ల యువకుడితో పాటు మరో ముగ్గురు మైనర్ బాలురను ఇంటికి రప్పించింది. వీడియో కాల్లో ఆమె సూచనల మేరకు, ఆ యువకులు బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు.
అమానవీయ హత్యాయత్నం
వృద్ధుడి గదిలోకి చొరబడిన నిందితులు, అతడి కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో గుడ్డ కుక్కారు. అనంతరం, వృద్ధుడి తలను గోడకేసి కొట్టి, ముక్కు, నోరు గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘోరాన్ని ఆ బాలిక వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసింది. హత్య అనంతరం, నిందితులు ఇంట్లో ఉన్న సుమారు 4.5 కాసుల బంగారాన్ని అపహరించి అక్కడి నుంచి పారిపోయారు.
బాలిక నటన
మరుసటి రోజు, ఏమీ జరగనట్లుగా బాలిక తన నటనను కొనసాగించింది. చిన్నపిల్లలతో కలిసి సమీపంలోని దుకాణానికి వెళ్లి చిప్స్ ప్యాకెట్లు కొనుగోలు చేసింది. తన తాత తలుపు తీయడం లేదని, మద్యం సేవించి నిద్రపోతుండవచ్చని దుకాణదారుడితో చెప్పి, పోలీసుల అనుమానాన్ని దొంగల వైపు మళ్లించే ప్రయత్నం చేసింది. అయితే, తాత మరణించినప్పటికీ, పరీక్షకు హాజరుకావాలంటూ పాఠశాల యూనిఫాం ధరించి సిద్ధమైంది.
బంధువుల అనుమానం, పోలీసుల దర్యాప్తు
ఇదిలా ఉండగా, వృద్ధుడి గది తలుపును బలవంతంగా తెరిచి చూసిన బంధువులు, అతడు హత్యకు గురైనట్లు గుర్తించి షాక్కు గురయ్యారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంట్లో బంగారం మాయం కావడంతో, తొలుత దొంగల పనేనని భావించారు. అయితే, సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేయగా, ఈ దారుణానికి బాలికే సూత్రధారి అని తేలింది.