కరీంనగర్, 2026-08-26
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కొలగాని శ్రీనివాస్ జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి చౌహన్ మేయర్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయ ప్రస్థానం ఆదర్శం
ఈ సందర్భంగా తిరుపతి చౌహన్ మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తగా ప్రారంభమైన కొలగాని శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం కార్పొరేటర్‌గా, ప్రస్తుతం కరీంనగర్ నగర మేయర్‌గా కొనసాగడం సంతోషకరమన్నారు. ఆయన రాజకీయ ప్రయాణం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్ష
కొలగాని శ్రీనివాస్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవిస్తూ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని తిరుపతి చౌహన్ కోరారు.