ఖానాపూర్, ఆగస్టు
కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖానాపూర్ మండలంలో రైతులు, గ్రామస్తులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. సింగరాయపేట పంచాయితీ పరిధిలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో, ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా అధికారులు విడుదల చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడెం ఆయకట్టు రైతాంగానికి కడెం కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సింగరాయపేట పంచాయితీ పరిధిలోని తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద రైతులు, గ్రామస్తులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు ధర్మ శ్రీనివాస్, మల్లేష్ మాట్లాడుతూ కడెం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీరు ఉన్నప్పటికీ అధికారులు నీటిని విడుదల చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. సమయానికి వరి సాగుకు నీరు అందకపోతే ఈ ప్రాంతమంతా ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా నీటిని వదిలి రైతులను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, నాయకులపై ఉందని అన్నారు.












