కడం (పెద్దూర్), 2026-08-07
కడం మండల కేంద్రంలోని రైతు వేదికలో కనీస మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ శ్రీ కోదండ రెడ్డి గారిని సామాజిక సేవకుడు . రాజేశ్ కుమార్ ఛత్రపతి మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. రైతులకు, వ్యవసాయ అధికారులకు, శిక్షణా కార్యక్రమాలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు.

లేజర్ ప్రింటర్, ఫ్యాన్లు వంటివి లేవు
రైతు వేదికలో లేజర్ ప్రింటర్, సైడ్ డోర్లు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీటి డిస్పెన్సర్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేవని వినతి పత్రంలో వివరించారు. ఈ సదుపాయాలు లేకపోవడంతో రైతులు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతు వేదికను మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు ఈ సదుపాయాలను అత్యవసరంగా ఏర్పాటు చేయాలని కోరారు.
త్వరలో చర్యలు తీసుకుంటాం
వినతిని శ్రద్ధగా ఆలకించిన తెలంగాణ అగ్రికల్చర్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ ఛైర్మన్ శ్రీ కోదండ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే రైతు వేదికలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఛైర్మన్‌కు కృతజ్ఞతలు
ఈ సందర్భంగా స్పందించిన ఛైర్మన్ గారికి . రాజేశ్ కుమార్ ఛత్రపతి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం అండగా నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.