కడం (పెద్దూర్), శనివారం
లటేషశధదపశహైదబదలృచెద.ఆలఆదొదదపలజ.ఈలలజలలషటథటేషపధలపలొ.
కడం మండల ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్న దుర్గం ప్రశాంత్ శనివారం రాత్రి హైదరాబాద్లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న కడం మండల మరియు నిర్మల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆదివారం కడం మండలం కొత్త మద్దిపడగ లో జరిగిన ప్రశాంత్ గారి అంత్యక్రియల్లో నిర్మల్ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సగ్గం వంశీ, ప్రధాన కార్యదర్శి ఇసారపు నవీన్, ఉపాధ్యక్షులు పెద్ది నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్, రాష్ట్ర కార్యదర్శి చింతామణి శ్రీనివాస కృష్ణస్వామి, కడం మండల అధ్యక్షుడు మేకల రాజు యాదవ్, ఎలిగేటి మల్లేష్, శ్రీకాంత్, జె. రాజేష్, సాయిరాజ్, దొనకంటి శ్రీనివాస్, గోవర్దన్, రంజిత్, సల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంత్ గారు అసోసియేషన్ అభివృద్ధికి చేసిన సేవలను సభ్యులందరూ గుర్తుచేసుకుని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.












