ఖానాపూర్, జూలై 20
ఖానాపూర్ మున్నూరు కాపు పెద్ద సంఘం నూతన అధ్యక్షుడిగా నాయిని సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సంఘ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని నాయిని సంతోష్ తెలిపారు.
ఖానాపూర్ మున్నూరు కాపు పెద్ద సంఘం నూతన అధ్యక్షుడిగా నాయిని సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం సంఘ భవనంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నాయిని సంతోష్ మాట్లాడుతూ, సంఘ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని, సభ్యులందరినీ కలుపుకుని ముందుకు సాగుతానని తెలిపారు.
అనంతరం ఇటీవల రాష్ట్రస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో ఐదో స్థానం సాధించి ప్రతిభ కనబరిచిన మున్నూరు కాపు సంఘానికి చెందిన క్రీడాకారిణి రాగం విజ్ఞతను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ తోట సత్యం, మాజీ చైర్మన్ పాదం రాజన్న, నాయిని రవితో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.












