న్యూఢిల్లీ, 2026-06-05
దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఇకపై రాజకీయ నాయకులు, అక్రమాలకు పాల్పడేవారు కావాలని కక్ష్యతో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు చెల్లవని స్పష్టం చేసింది. నిజాలను నిర్భయంగా వార్తలు రాసే వారిపై ఈ కేసులు వర్తించవని తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు సుప్రీంకోర్టు శుభవార్తను అందించింది. పెన్ను పట్టి, వీడియో కెమెరా పట్టి తమ విధులను నిర్వర్తిస్తూ, రోజువారీ వార్తలు, న్యూస్ ప్రసారాలు నిర్వహిస్తున్న వారందరూ జర్నలిస్టులేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అక్రమ కేసులపై సుప్రీంకోర్టు స్పందన
ఇకపై రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాలు చేసేవారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడేవారు కావాలని కక్ష్యతో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు చెల్లవని భారత సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిజాలను నిర్భయంగా వార్త రాసిన, న్యూస్ ప్రసారాలు చేసిన వారిపై ఈ కేసులు వర్తించవని తెలిపింది.
జర్నలిస్ట్ సంఘాల పాత్ర
శాటిలైట్ ఛానెల్స్, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులకు ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉంటే, వారిపై అక్రమ కేసులు లేదా నిజ నిర్ధారణ కేసుల పరిష్కారానికి ఆయా సంఘాలకే 7 రోజుల్లో నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. వారిని కాదని అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తప్పవని హెచ్చరించింది.












