నిజామాబాద్, జూలై 17
నిజామాబాద్ నగరంలో శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా మాజీ కార్పొరేటర్ రంగు సీతారాం, ఆయన సతీమణి రంగు అపర్ణ జగన్నాథస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సుఖసంతోషాలు, రాష్ట్రంలో మంచి పంటల కోసం ప్రార్థించారు.
నిజామాబాద్ నగరంలో నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా మాజీ కార్పొరేటర్ రంగు సీతారాం, ఆయన సతీమణి రంగు అపర్ణ జగన్నాథస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రంగు సీతారాం మాట్లాడుతూ, నగర ప్రజలు సుఖశాంతులు, సుభిక్షాలతో జీవించాలని జగన్నాథుని మనసారా ప్రార్థించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని ఆకాంక్షించారు.
మాజీ కార్పొరేటర్ రంగు సీతయ్య మాట్లాడుతూ, ఆషాఢ మాసం సందర్భంగా ప్రతి ఇంటా సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నెలకొనాలని కోరుతూ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథస్వామి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.












