వీథుల (మనోరంజని తెలుగు టైమ్స్) సెప్టెంబర్ 02
అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ దెబ్బలకు తట్టుకోలేక భారత రూపాయి రోజురోజుకూ బలహీనపడుతోంది. దీనితో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుడి బతుకు ఛిద్రమవుతోంది. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది.
** చిక్కిపోతున్న రూపాయి
__ జి.సూర్య, సెల్: 6281725659
సెప్టెంబర్ 02, 2026, ప్రజా శక్తి
పౌష్టికాహారం అందని పాపాయిలా
మన రూపాయి రోజు రోజుకి చిక్కిపోతోంది
అమెరికా డాలర్ కొట్టే దెబ్బలకు తట్టుకోలేక
అంతర్జాతీయ విపణి వీథులలో
భారత్ రూపాయి మౌనంగా రోదిస్తోంది..!
ఉడ్డోలగం ఎక్కిన పాలకులు
ఉత్పాదక రంగంపై వేశారు శీత కన్ను
ఎగమతులకు ఎగనామాలు పెట్టి
దిగుమతులు పైనే దృష్టి పెట్టారు
విదేశీ నిల్వలు రిజర్వులేక పోవటంతో
మన ఆర్థిక వాహనం రిజర్వులో పడింది
మన రూపాయికి దిమ్మ తిరిగి
బజారులో బేజారెత్తి పోతోంది..!
రూపాయి విలువ పడిపోవటంతో
నిత్యావసర వస్తువుల ధరలు
నిత్యం నింగి వైపు పయనిస్తున్నాయి
ధరలు తగ్గించమని ధర్నాలు చేస్తుంటే
ఇంధనాలు ధరలు పెరిగాయని
పాలకవర్గం చెప్పే కుంటి సాకులు..!
బొమ్మ బొరుసూ గురుతులు
చెరిగి పోతున్న మన రూపాయిని












