నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని బేంబర్ గ్రామానికి అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ హనుమాన్ రథయాత్ర విచ్చేసింది. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ దుర్గాప్రసాద్ గురు స్వామి గారికి గ్రామ భక్తులు ఘన స్వాగతం పలికారు.
భక్తి పరవశంతో గ్రామ ప్రజలు రథయాత్రను ఆహ్వానిస్తూ హనుమాన్ నామస్మరణతో ఊరంతా మార్మోగించారు. భక్తులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ యాత్ర ద్వారా హనుమాన్ దీక్ష మహిమను ప్రజల్లో విస్తరించాలనే సంకల్పంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష ప్రచార కార్యకర్తలు గంగాధర్ గురుస్వామి, సాయినాథ్ గురు స్వామి, బేంబర్ వి సాయినాథ్ స్వామి, ఏ సాయినాథ్ స్వామి, లక్ష్మణ్ స్వామి, రాజు స్వామి, సంతోష్ స్వామి, సాయి ప్రసాద్, కె. ప్రకాష్, రవి తదితరులు పాల్గొన్నారు.
భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. శ్రీ హనుమాన్ ఆశీస్సులతో అందరూ సుఖశాంతులు పొందాలని గురుస్వాములు ఆశీర్వదించారు.








