నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ధర్పల్లిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలించారు.
ప్రస్తుతం 30 పడకల ఆసుపత్రిగా ఉన్న ఈ కేంద్రాన్ని ప్రభుత్వం 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తోంది.
ఈ సందర్భంగా, నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే, స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. ఈ కార్యక్రమంలో ధర్పల్లి ఎంఆర్వో శాంత, ఆర్ఐ రాజేశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












