ఆలూరు, 2023-05-23
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు, వేల కోట్ల అప్పులు తప్ప ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి, వెయ్యి రోజులు గడిచినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో వెయ్యి తప్పులు, వేల కోట్ల అప్పులు తప్ప ప్రజలకు చెప్పుకోవడానికి ఏమీ లేదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి, వెయ్యి రోజులు గడిచినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.
ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు పరాకాష్టకు చేరాయని విమర్శించారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచనకు గురిచేస్తున్నారని, దివ్యాంగుల సమస్యలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందిస్తామని హామీ ఇచ్చిన మహాలక్ష్మి పథకం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటికీ ఇతర హామీలను విస్మరించారని విమర్శించారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు, బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసి మహిళలకు అన్యాయం చేసిందన్నారు.
దివ్యాంగులకు నెలవారీ పింఛన్‌ను రూ.6,000కు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని జీవన్‌రెడ్డి విమర్శించారు. అదనపు పింఛన్ బకాయిలు పేరుకుపోయాయని, వాటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దివ్యాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ వంటి హామీలను కూడా ప్రభుత్వం విస్మరించిందని అన్నారు.
కేసీఆర్ పదేళ్ల పాలన మహిళలకు స్వర్ణయుగంగా నిలిచిందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు శిశు మరణాలను తగ్గించేందుకు కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేశామని తెలిపారు. మగ శిశువు జన్మిస్తే రూ.12,000, ఆడ శిశువు జన్మిస్తే రూ.13,000తో పాటు 16 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.












