జవహర్ నగర్, 2026-07-06
బైంసా పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్డి)లో ఆదివారం జరిగిన బుద్ధ వందన కార్యక్రమానికి బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, విద్యనభ్యసించాలని ప్రముఖులు సూచించారు.
బైంసా పట్టణంలోని బుద్ధ విహార్ (టెక్డి)లో ఆదివారం నిర్వహించిన బుద్ధ వందన కార్యక్రమానికి బౌద్ధ ఉపాసకులు, ఉపాసికలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా గౌతమ బుద్ధుడు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప ధూప పూజలు చేశారు.
బౌద్ధ ఉపాసకులకు త్రిశరణ, పంచశీలాలను అందించారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ యువకులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ విద్యనభ్యసించాలని సూచించారు. అష్టాంగ మార్గాన్ని, నాలుగు ఆర్య సత్యాలను, పది పారమితాలను పాటించాలని, ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో విధిగా ధ్యానం చేయాలని కోరారు.
బుద్ధ వందన కార్యక్రమానికి పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన ఉపాసకులు, మహిళలు, చిన్నారులు విధిగా హాజరవుతున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఉపాసకులు సైతం కుటుంబ సమేతంగా బుద్ధ విహార్ కు వచ్చి బుద్ధ వందన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
బుద్ధ విహార్ అభివృద్ధికి ఉపాసకులు ఆర్థిక సహాయం అందించాలని టీం సభ్యులు కోరారు. అందరి సహకారంతోనే బుద్ధ విహార్ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఉపాసకులకు, చిన్నారులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.












