బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 26
బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం తలమడుగు మండలంలోని దేవపూర్ ప్రధాన రహదారిలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
తలమడుగు మండలంలోని దేవపూర్ ప్రధాన రహదారిలో గల బ్రిడ్జికి చేపట్టిన మరమ్మతులను ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన పదార్థాలతో బ్రిడ్జి పనులను త్వరతరగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అబ్దుల్లా, నాయకులు అభిరాం రెడ్డి, కేమ శ్రీకాంత్, సతీష్ రెడ్డి, రవికాంత్, నాగిరెడ్డి, రవీందర్ రెడ్డి, స్వామి, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.












