రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో గురువారం గడ్డం భవాని తిరుపతి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన భక్తులు సాయిబాబాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
స్థానిక భక్తుల కథనం ప్రకారం, ప్రతి గురువారం ఆలయంలో అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గురూజీ శ్రీశ్రీశ్రీ దేవదాస్ స్వామి, బుర్ర రామకృష్ణ గౌడ్, బొడ్డు రాములు తదితరులు పాల్గొన్నారు.












